అవేశాపడుతూ ఎక్కాను మెట్లు...
మట్టి రంగులో చెక్క మెట్లు నూనె అద్దిన శరీరం లా మెరుస్తూ వున్నాయి...
అడుగేసిన ప్రతిసారి గట్టిగ శబ్దం వస్తు నా ఆవేశాన్ని రెట్టింపు చేస్తున్నాయి..
ఎందుకల సిగ్గుపడకుండా నాట్యం చేసానో అనే ప్రశ్న ఇంకా మదిలో మెదులుతూనే ఉంది..
పరాయి దేశంలో ఆ సాయంకాలం వేసిన అకుపచ్చ గాలి లో
నింగి నుండి రాలిన చల్లటి నీటి బిందువుల సవ్వడిలో, వర్ణ సిరి, హృదయపు సవ్వడిని నృత్యరూపంలో వెదజల్లింది
ఆ వైనం చూసింది కేవలం ఇద్దరే
ఒకటి ఆకాశం
రెండోది తను
ఆ తను, తనో లేక ఇంకోతనో!
కిటికీ వద్దనుంచి .......
`
No comments:
Post a Comment