Sunday, September 23, 2012

నిద్రపోవాలి

మీదికి  వచ్చాయి 
ఆకుల నడుమ నుంచి దూరుతూ గాలి మెలికలు 

నే పడుకుని ఉన్నా 
ఆకాశానికి భూమికి అతి దగ్గరలో 
 
నా చూట్టు నల్లటి మట్టి 
దాని వాసన
 
దోమతెర ఒక వారగా తెరిచి 
చిన్నగా నా ముఖం చేను వైపు,  ఆకశం వైపు చూసా 
 
ఇంటి దగ్గర చాలాసేపు ఏడ్చి వచ్చా చేనుకు 
బాబాయి తో పాటు కావలి కోసం 
 
కొన్ని దయ్యం కథలు గుర్తుకు వచ్చి 
వెంటనే మూసేస దోమతెర 
దయ్యం అందులోకి రాలేద నుకున్నానేమో 
కళ్ళు గట్టిగ మూసేసా 
 
పడుకున్నానేమో 
మళ్లి అలా చేయలనివుంది ఇవాళ 
 
మా చేనులో 
మా వూరిలో 
మా ఆకాశం వైపు చూస్తూ 
కంటి నిండా నిద్రపోవాలి 
 
 

1 comment:

  1. This makes me nostalgic...buddala kapala kosam babai vallu velthe mummy tho godava pettukuni vellevallam :D Summer nights spent in our village are worth million dollars!!!

    ReplyDelete

Super proud

 My little brother is no more little.. He has grown up so big that now he went to a new country to study I feel quite proud of him and also ...