చంద్రుడి మధ్యలో ఆకాశం ఉన్నట్టు అనిపించింది
మొదటిసారి కొన్ని నెలల తరువాత చల్లటి గాలి వీచింది..చిన్న చిన్న మేగపు ముక్కలు చంద్రుని చూట్టుత చాప పరుచుకున్నాయి
కథ చెబుతాడెమో చందమామ...
నీటి లోపలి అందాలు నీటిలో వాటికే తెలుసునేమో
ఆకాశం తర్వాత అందాలన్నీనీకు మాత్రమే తెలుసు కదా...
కలిసిన రెండు హృదయాల మధ్య భంధం ఎంత దృడంగా ఉంటుంది కదా
నీకులాగే ఆ హృదయాలకు మాత్రమే తెలుసునేమో వాటి నిజమయిన అందo...
నీకు ఇవాళ ఒక విశయం చెబుదామనుకున్నా కాని
సాలె గూడులా నా మదిని అల్లుకపోయి నువ్వే ఒక విశేషమయ్యావు...
నెమ్మదిగా నా సమయాన్ని నీ వడిలో చేర్చుకొని
ఆ కధలేవో జోకొడుతూ చెప్పవా
నే నిద్దురపోతా....
No comments:
Post a Comment